ప్రజల సహకారంతోనే కరోనా నిర్మూలన

* మున్సిపల్ కమీషనర్ సురేంద్ర

UPDATED 27th OCTOBER 2020 TUESDAY 6:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిబంధనలు పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని, ప్రజల సహకారంతోనే ఆ వ్యాధిని నిర్మూలించవచ్చని మున్సిపల్ కమీషనర్ జె. సురేంద్ర పేర్కొన్నారు. పెద్దాపురం-వాలుతిమ్మాపురం రహదారిలో గల శ్రీలలితా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, వాలంటీర్లకు కరోనా వ్యాధి నియంత్రణపై మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మున్సిపల్ కమీషనర్ సురేంద్ర మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ కరోనా నివారణకు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని, బయటకు వచ్చినప్పుడు విధిగా మాస్క్ ధరించాలని అన్నారు. భౌతికదూరం పాటిస్తూ, తరుచూ చేతులను శానిటైజర్ తో కానీ సబ్బుతో కానీ శుభ్రం చేసుకోవాలని తెలిపారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఇంట్లో తయారు చేసిన వంటకాలను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా లలితా ఇండస్ట్రీస్ యాజమాన్యం సమకూర్చిన శానిటైజర్లు, మాస్కులను కార్మికులు, అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బూసి శ్రీదేవి, సబ్ ఇనస్పెక్టర్ ఏ. బాలాజీ, మున్సిపల్ శానిటరీ ఇనస్పెక్టర్ దావీదురాజు, శ్రీలలితా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్స్ మట్టే సత్య ప్రసాద్, మట్టే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us