శృంగారవల్లభస్వామి సన్నిధిలో ఆర్డీవో ప్రత్యేక పూజలు

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022: పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శృంగారవల్లభస్వామి సన్నిధిలో పెద్దాపురం ఆర్డీవో పి.వెంకటరమణ సతీసమేతంగా శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో ఆర్డీవోకు ఘన స్వాగతం పలికారు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితులు ఆర్డీవోకు వేదాశీర్వచనాలను అందచేశారు. అలాగే ఈవో స్వామివారి చిత్రపటాలను, ప్రసాదాలను ఆయనకు అందచేశారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాక్షించారు. ఈకార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బుద్దాల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us