వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు

UPDATED 13th APRIL 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి రాకుండా పూర్తిస్థాయిలో అన్ని చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వలు తక్కువస్థాయిలో ఉన్నాయని, గోదావరి జలాలు మళ్లింపుకు మున్సిపల్, ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ పట్టణాల ప్రజలకు మంచి నీటి అవసరాలపై ఉన్నతాధికారులతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాకినాడ ఇన్ ఛార్జి కమీషనర్ తో పాటు కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారన్నారు. పంటకాలం పూర్తి అయినందున పూర్తిస్థాయిలో గోదావరి జలాలు మంచినీటి చెరువులు నింపేందుకు మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకొన్నారని చెప్పారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కాకినాడ తదితర ప్రాంతాల నుంచి చెత్త చెదారాలతో వచ్చే పారిశుధ్య వాహనాలు పట్టణ పరిధిలో పారబోయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని కమీషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇ డి. ప్రభాకరరావు, ఎఇ రాజశేఖర్, టి.పి.ఎస్ మంజుల, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us