Crime news: పౌష్టికాహారం డబ్బాలో మరో ప్యాకెట్‌.. అదేంటో తెలుసుకుని మహిళ షాక్‌!

లండన్‌ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : ఓ మహిళ.. తన పిల్లల కోసం తెచ్చిన పౌష్టికాహారం (సిరియల్‌) డబ్బాను తెరిచి ఓ గిన్నెలో పోస్తున్నారు. ఇంతలో డబ్బాలో ఏదో అడ్డుపడుతున్నట్లు గుర్తించారు. తీరా ఓ కవర్‌ బయటపడగా అందులో తెల్లరంగు క్రిస్టల్స్‌ కనిపించాయి. అవేంటో తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో వెతికిన ఆమెకు.. ఒక్కసారిగా షాక్‌ తగిలింది! కారణం.. అది మెథాంఫేటమిన్ (క్రిస్టల్ మెథ్‌) మాదకద్రవ్యంగా తేలడమే. ఈ వ్యవహారం బ్రిటన్‌లో తాజాగా వెలుగుచూసింది. దీంతో ఆందోళనకు గురైన ఆ మహిళ.. వెంటనే ఆ కవర్‌ను పోలీసులకు అప్పగించినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. మరోవైపు పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లి, పరీక్షలు చేయించగా.. అదృష్టవశాత్తు వారిలో డ్రగ్‌ ఆనవాళ్లు దొరకలేదని ఆమె చెప్పారు. ‘ఈ ఘటనతో నిజంగా షాక్‌కు గురయ్యా. సిరియల్‌ డబ్బాలో ఈ డ్రగ్స్‌ ప్యాకెట్‌ సగం వరకు ఉంది. దాదాపు 450 గ్రాముల క్రిస్టల్‌ మెథ్‌ బయటపడింది. ఆ కవర్‌ కూడా పలుచగా ఉండటంతో.. ఆ డ్రగ్స్‌ సిరియల్‌లో కలిసిపోయిందనుకున్నా. కానీ, పిల్లలకు ఏం కాకపోవడం అదృష్టం’ అని ఆ మహిళ చెప్పుకొచ్చారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ డ్రగ్స్‌ ప్యాకెట్‌ను అందులో ఎవరు పెట్టారో గుర్తించేందుకు యత్నిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us