UPDATED 5th OCTOBER 2017 THURSDAY 6:30 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ సంక్రాంతి కానుకగా జనవరి 10, 2018న విడుదల కానున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్ తో పాటు మ్యూజికల్ వీడియో ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుండగా, ఇంజనీర్ బాబు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దేవుడే దిగి వచ్చినా .. గోకుల కృష్ణుడు .. మాధవుడు , రాజు వచ్చినాడో అనే టైటిల్స్ పరిశీలనలోకి వచ్చాయి. అయితే కొద్ది రోజుల నుండి పవన్ చిత్రానికి టైటిల్ అజ్ఞాతవాసి అంటూ ప్రచారం చేస్తుండగా, మూవీ యూనిట్ కూడా ఇదే టైటిల్‌కి ఫిక్స్ అయినట్టు సమాచారం. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. దీపావళికి దీనిపై ఓ క్లారిటీ రానున్నట్టు సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. పవన్ 25 చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుందని తెలుస్తుండగా, ఇందులో పవన్ స్టార్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.







