ఆదిత్యలో గూగుల్ క్లౌడ్ వర్క్ షాప్

UPDATED 20th JULY 2018 FRIDAY 5:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో తృతీయ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు టి-హబ్ పర్యవేక్షణలో గూగుల్ క్లౌడ్ వర్క్ షాప్ నిర్వహించినట్లు ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రముఖ సపోర్ట్ అనలిస్ట్ శ్రీస్వరూప్ పర్యవేక్షణలో సిటిఎస్-గూగుల్ వర్చ్యువల్ మిషన్, గూగుల్ క్లౌడ్ నెట్ వర్క్, లోడ్ బ్యాలెన్సర్ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. అనంతరం శ్రీస్వరూప్ ను జ్ఞాపిక, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, విభాగాధిపతులు, ప్రొఫెసర్ ఎ. వానతి, ప్రొఫెసర్ ఎమ్. రాజబాబు, ప్రొఫెసర్ సుధారాణి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us