Viral Video: అడ్డొచ్చిన బాలుడి పైనుంచే వెళ్లిన బ్రిటన్‌ రాయల్ గార్డు.. వీడియో వైరల్‌!

లండన్‌ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: బ్రిటన్‌లోని టవర్ ఆఫ్ లండన్ ప్రాంతం.. సందర్శకులతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. ఆ సమయంలో ఇద్దరు రాయల్‌ గార్డులు గంభీరంగా కవాతు చేస్తున్న ఓ గార్డుకు అడ్డుగా వచ్చాడు. వెంటనే అతని కాళ్లకింద పడిపోయాడు. కానీ, ఆ గార్డు మాత్రం ఆగకుండా.. అతనిపైనుంచి అలాగే వెళ్లిపోయాడు. అయితే, కిందపడిన బాలుడు వెంటనే లేవడంతో.. అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ట్విటర్‌లో 20 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ ఘటనపై స్థానిక రక్షణ మంత్రిత్వశాఖ స్పందించింది. దీని గురించి తమకు తెలుసని ఒక ప్రకటనలో తెలిపింది. గార్డులు వస్తున్నారని ప్రజలను ముందస్తుగానే హెచ్చరించామని, కానీ.. దురదృష్టవశాత్తు ఆ బాలుడు సైనికుడికి అతి సమీపంలో వెళ్లినట్లు పేర్కొంది. అయినప్పటికీ.. ఆ సైనికుడు అతన్ని దాటే అడుగేసినట్లు, అనంతరం ఆ పిల్లాడినీ పరామర్శించినట్లు తెలిపింది. ‘క్వీన్స్ గార్డ్’ బృందం.. బ్రిటన్‌లోని రాచరిక నివాసాలకు కాపలా బాధ్యతలు చూస్తుంటుంది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై నెటిజన్లనుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఆ సమయంలో పిల్లాడి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించగా.. మరికొందరు ఈ కవాతు సంప్రదాయాన్ని విమర్శించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us