ఇంటర్‌ పరీక్షల షెడ్యూలులో మార్పు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబరు 2021: ఇంటర్‌ అర్ధసంవత్సర పరీక్షల షెడ్యూలును ఇంటర్‌ విద్యామండలి మార్చింది. ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులకు సిలబస్‌ పూర్తి కానందున వాయిదా వేయాలని ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యదర్శి శేషగిరిబాబు పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు జనవరి ఐదు వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది అర్ధ సంవత్సరం పరీక్షలను కామన్‌ ప్రశ్నపత్రంతో నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించలేకపోతే వీటినే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us