ఘనంగా శ్రీరామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం

UPDATED 31st JULY 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక ఐదు తూములు వద్ద వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణా సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో పరమానందగిరి స్వామి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణ మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ 13వ వార్షికోత్సవంలో ఈనెల 21 నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఆఖరి రోజైన బుధవారం మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. కల్యాణోత్సవం తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పండితులు పెండ్యాల వీర వెంకట సుబ్రమణ్యం, మణికంఠ, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us