UPDATED 9th APRIL 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: మండలంలోని హుస్సేన్ పురం గ్రామంలో జియో సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని గ్రామస్థులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా గ్రామ నాయకుడు చల్లా బుజ్జి మాట్లాడుతూ ఇప్పటికే చుట్టుప్రక్కల అనేక పరిశ్రమల వల్ల గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సెల్ టవర్ తో కొత్త సమస్యలను తెచ్చుకోవడానికి సిద్ధంగా లేరని, సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని తహసీల్దార్ ఎల్. శివకుమార్ కు వినతి పత్రం అందజేశారు.







