UPDATED 27th NOVEMBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పధకంలో భాగంగా పనుల గుర్తింపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేకాధికారి డాక్టర్ నీరజ మాట్లాడుతూ ఉపాధి హామీ పధకం ద్వారా ప్రతీ కూలీకి పనులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామసభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సాగులో రైతులు సాంకేతిక పద్ధతులు అవలంభించాలని, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజనా పధకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, రైతుల ద్వారా సమాచారాన్ని సేకరించి అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి, పంచాయతీ కార్యదర్శి రమణ, తదితరులు పాల్గొన్నారు.







