సామర్లకోట:6 జూలై 2020(రెడ్ బీ న్యూస్): సమాజసేవలో సామర్లకోట లయన్స్ క్లబ్ ముందంజలో ఉన్నట్లు లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ అనిల్ కుమార్ జైన్ తెలిపారు. ఆలాగే రూ.1.33 కోట్లతో జిల్లాలో పేదలకు ఆరోగ్య వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక ఆసుపత్రిలో ప్రపంచ జూనోసిస్ డే దినోత్సవం సందర్భంగా పెంపుడు కుక్కల నుంచి మనుషులకు వ్యాధులు ప్రబలకుండా వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని స్థానిక భీమేశ్వర లయిన్స్ క్లబ్ సౌజన్యంతో క్లబ్ అధ్యక్షులు మేకా శ్రీనివాసరావు,మహిళాధ్యక్షురాలు చిత్తలూరి శ్రీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ అనిల్ కుమార్ జైన్, మాజీ గవర్నర్ బాదం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో లయిన్స్ ముందంజలో ఉన్నారన్నారు. జిల్లాలో 56 లయన్స్ క్లబ్ లు ఉండగా వాటిలో సామర్లకోట లయన్స్ క్లబ్ ముందంజలో ఉందన్నారు. ఈ క్లబ్ అంటే తమకు ఎంతో ఇష్టమని తెలిపారు. అందుకే స్థానిక క్లబ్బుకు తాజాగా ఒక రీజియన్ చైర్మన్ ఒక జోన్ చైర్మన్ పదవులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జెడి ఎస్టీ శ్రీనివాసరావు,డిడిబి ప్రసాదరావు, డాక్టర్లు అనురాధ,కె.తాతయ్య,పి.మనోజ్ కుమార్ పాల్గొని కుక్కలకు వ్యాక్సిన్ వేశారు.ఈ కార్యక్రమంలో 500 కుక్కలకు వ్యాక్సిన్లు వేయగా దీనిలో రీజియన్ చైర్మన్ చిత్తలూరి రాజా జోన్ చైర్మన్ మేక శ్రీనివాసు నాయకులు ఈదల ఈశ్వర కుమార్,నూతన కార్యదర్శి ఈదల మంగాదేవి, సిరిపురపు సుధారాణి,క్లబ్ నాయకులు ఆదినారాయణరెడ్డి, సింగవరపు సత్యనారాయణ, సేపేని సురేష్,అమలకంటి శ్రీనివాస్,గుండు శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు..
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







