UPDATED 29th OCTOBER 2019 TUESDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): స్త్రీ, శిశు సమగ్ర అభివృద్ధి సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ టి.వి. శ్రీనివాస్ సామర్లకోట అర్బన్ ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం-1 సెక్టార్ పరిధిలోని కొత్తూరు అంగన్వాడీ కేంద్రం సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆయన సందర్శించిన సమయంలో సుమారు 15 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించి, భోజనం అమలు, కోడిగుడ్ల పంపిణీ తీరుపై సమాచారం సేకరించారు. చిన్నారుల బరువు, ఎత్తు సంబంధించి రికార్డులు పరిశీలించి స్వయంగా చిన్నారుల బరువు తూచారు. గృహ సందర్శనలు, గర్భిణీ, బాలింతలు సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై తనిఖీలు చేశారు. కోడిగుడ్డు సైజు చిన్నవి వస్తే తీసుకోవద్దని సూచించారు. మంచినీరు, వంటగది, టాయిలెట్ తదితర సదుపాయాలు పరిశీలించారు. చిన్నారుల ఆట, పాటలను తిలకించి వారిని అభినందించారు. అన్ని రిజిస్టర్లు, స్టాకు రికార్డులు పరిశీలించారు. అలాగే నిర్మాణంలో ఉన్న నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాలను పరిశీలించి నిధులు మంజూరుకు సిఫార్సు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త బి.వి.ఎన్. రత్నకుమారి, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.







