వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

UPDATED 8th NOVEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: పట్టణంలో మూడవ వార్డు పెన్షన్ లైన్ లో సుమారు 50 మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు సమక్షంలో   పార్టీలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ప్రతీ ఒక్క కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రతీ నియోజకవర్గంలోనూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రతీ కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, జగన్   ముఖ్యమంత్రి అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ వస్తుందని, అలాంటి పాలన చూడాలంటే జగన్ ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి వెంకటప్పారావు చౌదరి (దొరబాబు), కౌన్సిలర్ ఊబా జాన్ మోజస్, మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు,ఇంజేటి శ్యాముల్, సియాదుల రాము, గోనిపాటి లోవరాజు, గొనిపాటి శేఖర్, దొండపాటి లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us