పవన్ సినిమా టైటిల్ కే ఫిక్స్ అయిన మెగా హీరో

UPDATED 4th DECEMBER 2017 MONDAY 5:30 PM

ఫిదా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా హీరో, నాగబాబు వారసుడు వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించి గత కొన్ని రోజులుగా పలు వార్తలు హల్ చల్ చేశాయి. పవన్ కెరీర్ లో భారీ హిట్ గా నిలిచిన తొలి ప్రేమ టైటిల్ ని వరుణ్ తేజ్ మూవీకి వాడుతున్నారని సమాచారం. కట్ చేస్తే తాజాగా వరుణ్ తేజ్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తొలి ప్రేమ అనే టైటిల్ తో ఉన్న ఈ పోస్టర్ లో కేవలం వరుణ్ తేజ్ ని మాత్రమే చూపించారు. తొలి ప్రేమకి ఏ జర్నీ ఆఫ్ లవ్ అనే క్యాప్షన్ ని పెట్టారు. ఫిబ్రవరి 9, 2018న తొలిప్రేమ సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పోస్టర్ లో వరుణ్ లుక్ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ మూవీని వరుణ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచేలా దర్శకుడు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. జార్జి సి విలియమ్స్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా, థమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us