గంగవరం (రెడ్ బీ న్యూస్) 10. డిసెంబర్ 2021: బాలికల ఆరోగ్యం, ఆహారం విద్యా ప్రగతి విషయాల్లో ఉపాధ్యాయ సిబ్బంది తగిన శ్రద్ధ చూపాలని సహాయ గిరిజన సంక్షేమ అధికారిణి హాసిని, మండల విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను వారు వేర్వేరుగా శుక్రవారం సందర్శించి తనిఖీ చేశారు. వసతి గృహంలో వంటశాలలో వంట సామాగ్రి పరిశుభ్రత విషయంలో శ్రద్ధ చూపాలని సూచించారు. వసతి గృహం గదులను మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. వసతి గృహం పరిశుభ్రంగా ఉంచాలని ఆహార వంటకాలు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం రాత్రి సమయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి బాలికల విద్యా ప్రగతికి పురోగతికి కృషి చేయాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం విషయంలో వైద్య సేవలు అందించడంలో పాఠశాల ఏఎన్ఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. పాఠశాల ఆవరణలో న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, పాఠశాల పరిసరాల్లో మురుగునీరు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల ఇన్ ఛార్జ్ హెచ్ఎం పోతురాజు దొర, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







