UPDATED 20th JANUARY 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక 12వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు గుమ్మళ్ళ సత్తిరాజు(80) మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. అలాగే పరామర్శించిన వారిలో సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, గోలి సత్తిరాజు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, తదితరులు ఉన్నారు.







