ఇల్లు దగ్ధమైన కుటుంబాన్ని ఆదుకోవాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 30 అక్టోబర్ 2021: గంగవరం మండలం లక్కొండ గ్రామములో ఇటీవల ఇల్లు దగ్ధమైన భాదితులు వెలుగుల హరిచంద్రారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏజెన్సీ డివిజన్ కార్యదర్శి డి. సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై శనివారం న తాహశీల్దార్ శ్రీమన్నారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కొండ గ్రామంలో పూరి ఇల్లు కాలిబూడిదై సుమారు రూ.మూడు లక్షల రూపాయలు నష్టం వాటిల్లి కుటుంబం మొత్తం కట్టుబట్టలతో రోడ్డున పడ్డారని, వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో తహశీల్దార్ శ్రీమన్నారాయణ ఆ కుంటుబానికి ముప్పై కేజిల బియ్యం అందచేశారు. నష్ట పరిహారం కూడా అందేలా కృషి చేస్తానని హామి ఇచ్చారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us