UPDATED 20th MARCH 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: డి.ఆర్.డి.ఎ పథకాలు అమలులో భాగంగా ఉన్నతి రుణాలు ప్రగతిపై స్థానిక టిటిడిసి కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ మండలాల సమాఖ్య ప్రతినిధులకు టిటిడిసిలో రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణలో ఆమె ముఖ్య అతిథిగా డిపిఎం అనంతలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నతి పథకం ద్వారా రుణాలు పొందిన మహిళలు సకాలంలో చెల్లిచాలన్నారు. మరిన్ని సంఘాలకు రుణాలు అవకాశం కల్పించాలన్నారు. ప్రతీ సమాఖ్య అకౌంట్లు పూర్తి చేసి ఆడిట్ కు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం విజయకుమారి, డాక్టర్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.







