SC Railway: ఈనెల 18 నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్‌ (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021 : శబరిమలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 18 నుంచి 26వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్-కొల్లాం, కొల్లాం-సికింద్రాబాద్‌, కాచిగూడ-కొల్లాం, కొల్లాం-కాచిగూడ, నాందేడ్‌-కొల్లాం, తిరుపతి-కొల్లాం, తిరుపతి-నాందేడ్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అయ్యప్ప భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us