UPDATED 21st MARCH 2018 WEDNESDAY 10:00 PM
సామర్లకోట: పంచాయతీలలో డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు, చెత్తను సులభంగా బయటికి తరలించేందుకు ఉపయోగపడే టూ ఇన్ వన్ వాహనం ఉపయోగపడుతుందని స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ ఆర్. గోవిందరావు తెలిపారు. శిక్షణా కేంద్రం పరిదిలో గల ఐదు జిల్లాల పంచాయితీ కార్యదర్శులు, ఈవోపిఆర్డీలకు, సర్పంచులకు ఈ వాహనం పనితీరుపై బుధవారం అవగాహన కల్పించారు. 50 లీటర్ల కెపాసిటీ గల బకెట్ తో కూడిన ట్రాక్టర్ తో ఆపరేట్ చేసే ఈ మిషన్ విలువ సుమారు 10 లక్షలు అని, ఒక అడుగు వెడల్పు గల మురుగు కాలువలు శుభ్రం చేయవచ్చని, మేజర్ పంచాయతీలలో ఇటువంటి మిషన్లను కొనుగోలు చేసి పారిశుద్యాన్ని మెరుగుపరచడానికి అవకాశం ఉందని అన్నారు.







