UPDATED 5th FEBRUARY 2018 MONDAY 9:00 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల మండలంలోని నరేంద్రపురం గ్రామంలోని మండల పరిషత్ స్పెషల్ ప్రాధమిక పాఠశాలకు రూ. తొమ్మిది వేలు వ్యయంతో 50 కుర్చీలను వితరణగా సోమవారం అందచేశారు. గివింగ్ టు ది స్మైల్ చైల్డ్ కార్యక్రమంలో భాగంగా బిడిఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చిన్నారుల కోసం వీటిని సమకూర్చారు. ఈ సందర్భంగా కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి, కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు విద్యతో పాటు గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో భాగస్వాములు కావడం అభినందనీయమని, కళాశాల పిఆర్వోలు గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలకు కావలసిన సదుపాయాలను ముందుగా గుర్తించి తెలియాలని, దాని ప్రకారం సామాజిక సేవా కార్యక్రమాలలో కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లెనోరా డైరెక్టర్లు జి.నాగార్జునరెడ్డి, ఎ. ప్రసాద్ చౌదరి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దాల్ సింగ్, చిన్న పిల్లల దంత వైద్య విభాగాధిపతి డాక్టర్ వి.వి. రావు, డాక్టర్ పునీత, విద్యార్థులు, పిఆర్వోలు రాంబాబు, కుమార్, తదితరులు పాల్గొన్నారు.







