భక్తి శ్రద్ధలతో జ్వాలాతోరణం

UPDATED 13th NOVEMBER 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): కార్తీకమాసం బుధవారం కృత్తికా నక్షత్రం పురస్కరించుకుని ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత భీమేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచి స్వామి, అమ్మవారి దర్శనానికి భక్తులు బారులుతీరారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ తొలుత ఆలయంలో గోపూజ నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి గ్రామోత్సవం ఉత్సవ కమిటీ చైర్మన్ మట్టపల్లి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో నిర్వహించి రాత్రికి ఆలయం చేరింది. రాత్రి 7:30 నిమిషాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిలో ఉంచి గడ్డితో ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం కనులవిందుగా సాగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, ఆలయ పండితులు శ్రీపాద రాజశేఖరశర్మ, వేమూరి సోమేశ్వరశర్మ, కొంతేటి జోగారావు, సన్నిధిరాజు సుబ్బన్న, వెంకన్న, లక్ష్మణ్, చిరుకూరి రాంబాబు, భీమన్న, భమిడిపాటి శ్రీనివాసులు, ఉత్సవ కమిటీ సభ్యులు బి. వెంకటరమణ, యండమూరి సుబ్బారావు, అన్నదాన ట్రస్టు ప్రతినిధులు చుండ్రు గోపాలకృష్ణ, బిక్కిన సాయి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us