UPDATED 15th MARCH 2018 THURSDAY 10:00 PM
సామర్లకోట: స్థానిక జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ చెందిన స్థలాన్ని కొంత మంది ఆక్రమించి ఆ స్థలంలో గుడారాలు వేసుకుని ఉండడంతో ఎంపిడివో బి. నాగేశ్వరరావు, ఈవోపిఆర్డి సి.హెచ్. జగ్గారావు ఈ విషయాన్ని తహసీల్దార్ ఎల్. శివకుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే తహసీల్దార్ స్పందించి ఆక్రమణలు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ. ఎం .రాజేష్, విఆర్వో భరత్ పాల్గొన్నారు.







