UPDATED 14th MARCH 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట : పట్టణ ప్రజల అందరి సహకారంతోనే మున్సిపాల్టీకి స్వచ్ఛతా ఎక్సలెన్స్ అవార్డ్ లభించినట్లు మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామర్లకోట పురపాలక సంఘం జాతీయ స్థాయిలో స్వచ్ఛతా ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక కావడం ప్రజలు, సిబ్బంది యొక్క సమిష్టి కృషిగా భావించాలన్నారు. పురపాలక సంఘం మరింత పురోగతిని సాధించేందుకు పట్టణ ప్రజలంతా సహకరించాలని, అలాగే మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎవరికి వారు స్వచ్ఛందంగా తొలగించవలసిందిగా కోరారు. స్వచ్ఛందంగా తొలగించని ప్లెక్సీలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా మున్సిపల్ సిబ్బందితో తొలగించడం జరుగుతుందని చెప్పారు. ఆరోగ్యవంతమైన స్వచ్ఛ సామర్లకోటగా అభివృద్ధి చేయుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.







