UPDATED 9th APRIL 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: గర్బిణీల ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు నిర్వహించిన ఆరోగ్య పరీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని సోమవారం మాట్లాడారు. గర్భిణీలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అలాగే వారి ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అనంతరం సుమారు 120 మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి పౌష్టికాహారం అందచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్, మహంకాళి వెంకట గణేష్. ఐసిడిఎస్ సూపర్ వైజర్లు బాలాత్రిపుర సుందరి, ఎం. నళిని మంగ, డి. మణి, ప్రభుత్వాసుపత్రి డీసీఎస్ డాక్టర్ పి. చంద్రరావు, డాక్టర్ లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.







