193 కిలోల గంజాయి స్వాధీనం

గంగవరం (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: గంగవరం గ్రామశివారులో 193 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు. అడ్డతీగల నుంచి గంగవరం వైపు వచ్చే గంగవరం గ్రామ శివారులో ముందుగా వచ్చిన సమాచారంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ-31 ET 4911 ఇన్నోవా వాహనాన్ని పోలీసులను చూసి దూరంగా నిలిపివేసి అందులో వ్యక్తులు పరారయ్యారు. గంగవరం తహశీల్దార్ శ్రీమన్నారాయణ సమక్షంలో కారును తనిఖీ చేయగా 8 బస్తాల్లో 193 కిలోల గంజాయి లభించింది. దీని విలువ రూ. 3 లక్షల 86 వేలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. నిందితులకోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఏఎస్ఐ రజాక్, వీఆర్వో అప్పలకొండ పోలీస్ సిబ్బంది వీరబాబు, రమణ ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us