UPDATED 12th OCTOBER 2018 FRIDAY 5:00 PM
గండేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017-18 విద్యా సంవత్సరానికి ప్రకటించిన ప్రతిభా పురస్కారాలలో ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి ఏడు అవార్డులు ఆదిత్య సంస్థ విద్యార్థులు కైవసం చేసుకున్నట్లు ఆదిత్య పొలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 35 ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ఎనిమిది ప్రతిభా పురస్కారాలు ప్రకటించగా వాటిలో ఏడు పురస్కారాలను తమ సంస్థ విద్యార్థులు విక్రమ్ ప్రత్యుష (సివిల్ 95.27%), పిల్లా హరిత వెంకటప్రియ (కంప్యూటర్ సైన్స్94.49%), పెంకే నవీన్ దుర్గాప్రసాద్ (మెకానికల్-95.58%), జి.వి. సూర్యబాలాజీ (మెకానికల్ 97.27%), సి.హెచ్. లీలాకుమారి (మెకానికల్ 86.45%), సిహెచ్.వి.వి. సత్యనారాయణ (పెట్రోలియం టెక్నాలజీ 94.05%), ఎన్. నాగసునీల్ కుమార్ (పెట్రోలియం టెక్నాలజీ 93.61%) సాధించారని అన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి విద్యార్థులను, అధ్యాపక సిబ్బందిని అభినందించారు.







