న్యాయవాదుల సంక్షేమానికి నిధులు మంజూరు చేయాలి

UPDATED 10th NOVEMBER 2017 FRIDAY 9:00 PM

అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అమలాపురం బార్ అసోసియేషన్ హాల్లో జిల్లా స్థాయి బార్‌ అసోసియేషన్స్  సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర బార్‌ అసోషియేషన్‌ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు, గోకుల్‌ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమానికి 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన ఏ ఒక్క హామీనీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. న్యాయవాదుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే పరిహారాన్ని రూ. మూడు లక్షలు నుంచి పది లక్షలకు పెంచుతామని, జూనియర్‌ న్యాయవాదులకు స్టైఫండ్, గ్రూపు ఇన్సూరెస్స్‌, హెల్త్ కార్డులు తదితర అనేక హామీలు ఇచ్చారని కానీ వాటిలో ఏ ఒక్కటీ నేటి వరకూ అమలు కాలేదన్నారు. మెడికల్‌ బెనిఫిట్‌ రూ. 40 వేల నుంచి రెండు లక్షలకు పెంచేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు న్యాయవాదుల సంక్షేమానికి ఏటా రూ. వందల కోట్ల నిధులు మంజురు చేస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీ రూ. 100 కోట్లు న్యాయవాదుల సంక్షేమానికి ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా రూ. 150 కోట్ల నిధులు మంజురు చేసి న్యాయవాదుల సంక్షేమానికి దోహదపడాలన్నారు. దీనిపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో చర్చించి అమలు చేయాలని కోరారు. ఈ నెల 15వ తేదీన రాష్ట్రంలోని 13 జిల్లాల బార్‌ అసోసియేషన్ల సభ్యులు ఆయా జిల్లాల్లో కలెక్టరేట్‌లను ముట్టడించి కలెక్టర్లకు వినతిపత్రాన్ని అందజేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, ముమ్మిడివరం అధ్యక్షుడు  ప్రసాద్‌బాబు, రాజోలు అధ్యక్షుడు అయ్య వేమాజీ, సెక్రటరీ  నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us