రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

* ఆర్డీవో మల్లిబాబు

UPDATED 3rd DECEMBER 2020 THURSDAY 8:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): భారీ వర్షాల కారణంగా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని జి. రాగంపేట గ్రామంలో ఆయన పర్యటించి రైతులు కల్లాల్లో ఆరబెట్టిన రంగు మారిన ధాన్యాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ గత అయిదారు నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా దిగుబడి తగ్గి, ధాన్యం రంగు మారిందని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంచి ధాన్యానికి ప్రకటించిన మద్దతు ధరకు 5 నుంచి 7 శాతం తగ్గించి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదనే అపోహలు నమ్మవద్దని అన్నారు. ఎవరైనా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువెళ్లినపుడు వారు తిరస్కరిస్తే వెంటనే 8866613611 నెంబరుకు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. దళారులను నమ్మి తక్కువ ధరకు అమ్ముకోవద్దని, రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో ఆర్డీవో వెంట తహసీల్దార్ బూసి శ్రీదేవి, ఏడీఏ ఎం. రత్న ప్రశాంతి, ఏవో ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు.


          

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us