* వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు
* విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ
UPDATED 23rd JULY 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. సామర్లకోట-పెద్దాపురం ప్రధాన రహదారిలో గల విటికర్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులకు మంగళవారం ఆయన సైకిళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితోనే సాధ్యమవుతుందని, పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఆయన శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలను పకడ్బందీగా అమలు చేస్తోందని, ఇందులో భాగంగా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జానీ, హెచ్ఎం రత్నకుమారి, దవులూరి సుబ్బారావు, గవరసాన సూరిబాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటఅప్పారావు చౌదరి, మాజీ కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ, కాపుగంటి కామేశ్వరరావు, శివబాబు, ఆకుల వీరబాబు, ఇనకొండ విష్ణుచక్రం, సయ్యద్ జానీ, తదితరులు పాల్గొన్నారు.







