విద్యార్థులు భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదగాలి

UPDATED 28th SEPTEMBER 2018 FRIDAY 8:00 PM

పెద్దాపురం: విద్యార్థులు భవిష్యత్తులో భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ సిహెచ్.విజయ ప్రకాష్ అన్నారు. స్థానిక రామారావుపేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలను ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటామిక్ రీసెర్చ్(కల్పకం) శాస్త్రవేత్తలు డాక్టర్ సి.వి.యస్. బ్రహ్మానందరావు, డాక్టర్ యన్. రామనాధన్, డాక్టర్ ఎ. శ్రీరామచంద్రమూర్తి, నన్నయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జగన్ మోహనరెడ్డి విచ్చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్స్ శుక్రవారం సందర్శించారు. అనంతరం విద్యార్దులతో ముఖాముఖి నిర్వహించి, పలు ప్రయోగాలను చేసి విద్యార్థులను వైజ్ఞానిక పరంగా ఉత్తేజపరిచారు. అలాగే ప్రముఖ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలను కెమికల్ రియాక్షన్స్ ద్వారా చూపించి సర్ సి.వి.రామన్ తదితర మహనీయులను గుర్తు చేశారు. వైజ్ఞానిక రంగంపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్  సి. హెచ్. విజయప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని, అందుకు శ్రీప్రకాష్ విద్యాసంస్థలు అన్నివిధాలా సహాయసహకారాలు అందించేందుకు ముందుంటాయని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల సివోవో లెఫ్టినెంట్ కమాండర్ కె.యస్. రావు, ప్రొఫెసర్ యస్. ఆర్. సంతానం, వైస్ ప్రిన్సిపాల్ కె. నీరాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us