పెద్దాపురం ఎంపీడీవోగా ఉమామహేశ్వరరావు బాధ్యతలు స్వీకరణ

UPDATED 15th FEBRUARY 2019 FRIDAY 7:00 PM

పెద్దాపురం: పెద్దాపురం ఎంపీడీవోగా పిడుగు ఉమామహేశ్వరరావు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఆయన విశాఖ జిల్లా నక్కపల్లి నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటివరకు ఎంపీడీవోగా ఇక్కడ పనిచేసిన పల్లాబత్తుల వసంతమాధవి గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఉమామహేశ్వరరావు గతంలో వీడీవోగా ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఎంపీపీ గుడాల రమేష్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అలాగే ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, కార్యాలయ సూపరింటెండెంట్ విప్పర్తి సాయిబాబా, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us