UPDATED 15th DECEMBER 2018 SATURDAY 7:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో సిఎస్ఇ&ఐటి విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఈ నెల 13,14,15 తేదీలలో మూడు రోజులపాటు నిర్వహించిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ వర్క్ షాప్ లో భాగంగా ఈఎస్ఎఫ్ లాబ్స్ లిమిటెడ్ కు చెందిన నిపుణుల బృందం ఎ. పవన్ కుమార్, ఎమ్.హరికాంత్ విద్యార్థులతో మాట్లాడుతూ వ్యక్తిగత సమాచారాన్ని అంతర్జాలంలో హ్యాకర్లు ఎలా తెలుసుకొంటారో వివరిస్తూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు. ఈ వర్క్ షాప్ లో తృతీయ సంవత్సరం సిఎస్ఇ& ఐటి విద్యార్థులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఇ & ఐటి విభాగాధిపతులు ప్రొఫెసర్లు ఎ. వానతి, ఎం. రాజబాబు, ఎపిఐటిఎ కళాశాల కోఆర్డినేటర్ టి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.







