బాల గణితావధాని సాయివంశీ ప్రతిభ

UPDATED 30th DECEMBER 2017 SATURDAY 9:00 PM

రంపచోడవరం: శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ నిర్వహించిన గణితావధాన పోటీల్లో బాల గణితావధాని, ప్రముఖ గణితావధాని తోటకూర సాయిరామకృష్ణ శిష్యుడు అయిన సాయివంశీ విశేష ప్రతిభ కనబరిచి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నెల 29, 30 తేదీల్లో స్థానిక పి.ఎం.ఆర్.సి లో రంపచోడవరం, మారేడుమిల్లి మండలాలకు చెందిన ప్రథమ, ద్వితీయ స్థాయి ప్రతిభావంతులైన విద్యారులు, నిష్ణాతులైన గణిత మేధావులు సి.బి. చిన్నారి, జయ వెంకట లక్ష్మి, ఎ.విశ్వేశ్వరరావు, ఎం. సాయి సీతారాం, ఎం..శ్రీనివాస్, చిన్నిబాబు పృచ్ఛకులుగా వ్యవహరించిన గణితావధాన పోటీల్లో పృచ్ఛకులు సంధించిన పలు ప్రశ్నలకు సాయివంశీ ఇచ్చిన సమాధానాలతో ఈ కార్యక్రమం ఆద్యంతం ఎంతో రసవత్తరంగా సాగింది. పృచ్ఛకులు ఎటు కూడినా 92 వచ్చేలా మాయా చదరం రూపొందించమని కోరగా 36 విధాలుగా చెప్పి ఆశ్చర్యపరిచాడు.15 -8 -1947, 6 -6 -1966 ఏ వారం అని అడగ్గా మంగళవారం, శనివారం అని, దత్తకంలో భాగంగా 13తో భాగించబడే 12 అంకెల సంఖ్య గురించి, 117649 ఘనమూలం గురించి ఇలా పృచ్ఛకులు సంధించిన పలు క్లిష్టమైన ప్రశ్నలకు సెకెన్ల వ్యవధిలోనే వంశీ ఇచ్చిన సమాధానాలకు గణిత మేధావులు అబ్బురపడ్డారు. పి.ఎం.ఆర్.సి. పీఎంవో బి.ఎస్.కుమార్, కార్యక్రమ  పర్యవేక్షణాధికారి బి.కుమార్ మాట్లాడుతూ సాయివంశీ భవిషత్తులో మరిన్ని అవధానాలతో ఉన్నతస్థాయికి చేరుకొని మంచి ఖ్యాతి పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రముఖ గణితావధాని, రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయిన తోటకూర సాయి రామకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.డబ్యు .వెంకటేశ్వరావు, వివిధ పాఠశాలలకు చెందిన అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.            

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us