టిసిఎస్ అవార్డులు కైవసం చేసుకున్న ప్రగతి విద్యార్థులు

UPDATED 30th MARCH 2018 FRIDAY 9:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు టిసిఎస్ అత్యుత్తమ విద్యార్థి, అత్యుత్తమ ప్రాజెక్ట్ అవార్డులను కైవసం చేసుకున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన సివిల్ ఇంజనీరింగ్ విభాగం 2016-17 బ్యాచ్ విద్యార్థిని చంద్రాభట్ల హైమావతీ అన్నపూర్ణ టిసిఎస్ అత్యుత్తమ విద్యార్థి అవార్డు సాధించి బంగారు పతకం, సర్టిఫికెట్, నగదు పురస్కారం సాధించినట్లు తెలిపారు. అలాగే  ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం 2016-17 బ్యాచ్ ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల, కాకినాడ విద్యార్థులు సాల యశశ్వని, శిరీష, కర్ణాటకపు వంశీకృష్ణ, యనమండ్ర లక్ష్మీ ప్రవల్లిక, కొఠాని శ్రీనివాస్, డి.వి.వి. వర్మ, కె. నిఖిలేశ్వర్ లు వ్యవసాయరంగంలో వినియోగించే సౌర శక్తి  ఆధారిత రోబోట్లు రూపకల్పనకు సంబంధించి అత్యుత్తమ విద్యార్థి ప్రాజెక్ట్ అవార్డు కైవసం చేసుకుని బంగారు పతకం, సర్టిఫికెట్, నగదు పురస్కారం అందుకున్నారు. టిసిఎస్ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న కళాశాలలచే సూచించబడిన విద్యార్థులకు టిసిఎస్ సంస్థ ఈ అవార్డులు అందచేస్తారని తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందిస్తూ సామాజిక ప్రయోజనాలను కలుగచేసే ప్రాజెక్టులు విద్యార్థులచే రూపొందించే విధంగా వారిని ప్రోత్సహించడానికిగాను ఈ అవార్డులను టిసిఎస్ సంస్థ అందచేస్తారని ఆయన తెలిపారు. అవార్డు గ్రహీతలను కళాశాల చైర్మన్ కృష్ణారావు అభినందించారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us