UPDATED 4th JULY 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: పిఠాపురం రైల్వే స్టేషన్ లో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సామర్లకోట రైల్వే పోలీసులు తెలిపారు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మృతి చెంది ఉంటాడని, అతని వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటాయన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సామర్లకోట రైల్వే హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ తెలిపారు.







