ఘనంగా ముగిసిన క్రికెట్ పోటీలు

UPDATED 11th JUNE 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న అబ్దుల్ కలామ్ మెమోరియల్ క్రికెట్ పోటీలు సోమవారం ఘనంగా ముగిసాయి. ఈ పోటీల్లో మొత్తం 23 టీములు పాల్గొనగా విజేతలుగా నిలిచిన ఎఫ్.సి.సి జట్టుకు రూ. ఆరు వేలు నగదు పురస్కారం, షీల్డు, రన్నర్స్ గా నిలిచిన శివ బాయ్స్ జట్టుకు రూ. మూడు వేలు నగదు, షీల్డుని ప్రముఖ పారిశ్రామికవేత్త దవులూరి దొరబాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి దొరబాబు, ఆరవ వార్డు కౌన్సిలర్ ఊబా జాన్ మోజెస్ చేతులు మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో రెండవ వార్డు కౌన్సిలర్ జుత్తుక సుబ్బలక్ష్మి, ఐదవ వార్డు కౌన్సిలర్ పితాని సూర్యనారాయణ, ముత్యం రాజుబాబు, నిర్వాహకులు రవితేజ, లోవరాజు, రాజేష్, నవీన్, మోబీన్, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us