కరోనా వైరస్ పై అవగాహనా ర్యాలీ

UPDATED 18th MARCH 2020 WEDNESDAY 6:00 PM

రాజానగరం(రెడ్ బీ న్యూస్): గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహనా ర్యాలీ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ మాట్లాడుతూ కరోనా వైరస్ పై ఆందోళన చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒకరికొకరు కరచాలనం చేసుకోవద్దని, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అలాగే ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తమ ఇంటి పరిసరాల్లో ఉన్న వ్యక్తులకు, కుటుంబాలకు కరోనా వైరస్ పై చైతన్యం కల్పించాలని ఆయన సూచించారు. అనంతరం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎన్. లీలావతి, డాక్టర్ ఎస్.వి.ఎస్.ఎన్. మూర్తి, డీన్ డాక్టర్ వి. కుసుమకుమారి, వివిధ విభాగాల అధిపతులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వై.డి. శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.              

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us