మభ్యపెడుతున్న పార్టీలకు బుద్ధి చెప్పండి

UPDATED 8th APRIL 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: రాజకీయాలను అభాసుపాలు చేస్తూ మభ్యపెడుతున్న పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని  సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దువ్వా శేషుబాబ్జీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎంఎల్ఏ అభ్యర్థి తుమ్మల రామస్వామి(బాబు)కు మద్దతుగా సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సామర్లకోట మండలం హుస్సేన్ పురం, వేట్లపాలెం, మేడపాడు గ్రామాలతో పాటు పెద్దాపురం మండల పరిధిలోని పలు గ్రామాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శేషుబాబ్జీ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను చట్టసభలకు పంపిస్తే మరిన్ని సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఓటర్లందరూ ధైర్యంగా ప్రజల పక్షాన ఉండి నిరంతరం పోరాడి అందుబాటులో ఉండే కమ్యూనిస్టు ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశాన్ని, రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, అటువంటి పార్టీలను ఈ ఎన్నికల్లో ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కరణం ప్రసాదరావు, నీలపాల సూరిబాబు, బాలం శ్రీనివాస్, బి. బాలాజీ, తుంపాల శ్రీనివాస్, కె. గోవిందరాజు, సత్తిబాబు, శివ, శ్రీను, వీరబాబు, కృష్ణ, సింహాచలం, గోపాల్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us