గ్రామ సచివాలయ నిర్మాణంపై ఫిర్యాదు

UPDATED 21st JULY 2020 TUESDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలో నిర్మించనున్న గ్రామ సచివాలయ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు మంగళవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ  హయాంలో ఇదే ప్రాంతంలో కళ్యాణ మండపం నిర్మించేందుకు నిధులు సైతం మంజూరు చేయడం జరిగిందని, అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ ప్రాంతంలో సచివాలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయాన్ని వేరే ప్రాంతంలో నిర్మించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ డీటీ రామ్ కుమార్‌కు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో కె. వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us