విద్యార్థులు సమాచార నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

UPDATED 22nd FEBRUARY 2018 THURSDAY 9:00 PM

గండేపల్లి: విద్యార్థులు సమాచార నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎ.పి.ఎస్.సి.హెచ్.ఇలో భాగంగా నిర్వహించిన బ్రిటీష్ కౌన్సిల్ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన గురువారం పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో సమాచార నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు, అలాగే ఉద్యోగాలకు సమాయత్త పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న కళాశాలగా ఆదిత్య రాష్ట్రంలోనే ప్రధమంగా నిలవడం గర్వకారణం అన్నారు. ఈ పథకంలో శిక్షణ పొందేందుకు తమ కళాశాల విద్యార్థులు 598 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని,  అలాగే ముందుగా కళాశాలకు చెందిన 20 మంది అధ్యాపకులకు బ్రిటీష్ కౌన్సిల్ శిక్షణ ఇచ్చిందని తెలిపారు. విద్యార్థులకు మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారికి ఆప్టిస్ పరీక్షను నిర్వహించి సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరుగుతుందని చెప్పారు. శిక్షణ విజయవంతంగా ముగిసేందుకు కృషి చేసిన వారిని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి..శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us