ఉద్యమాన్ని ఆపేది లేదు: ఏపీ ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: ఏపీ ఐకాస, అమరావతి ఐకాసల ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్రారంభించిన ఉద్యమాన్ని ప్రభుత్వం స్పందించే వరకు ఆపేది లేదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు, ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడ వెళుతూ మార్గ మధ్యలో మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో ఆగిన ఆయన ఏపీఎన్జీవో హోంలో ఐకాస సంఘ నేతలతో వివిధ అంశాలపై చర్చించారు. 2018 జులై 1 నుంచి పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బును తిరిగి ఇవ్వకపోవడం దారుణమన్నారు. డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమిద్దామన్నారు. కార్యక్రమంలో ఏపీఎన్జీఓ రాజమహేంద్రవరం శాఖ అధ్యక్ష, కార్యదర్శులు వై.వి.సుబ్బారాయుడు, ప్రవీణ్‌కుమార్‌, రాష్ట్ర ఐకాస కార్యదర్శి వేణుమాధవ్‌, సీపీఎస్‌ నగర అధ్యక్షుడు అనీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయవాడ బయలుదేరారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us