గర్భిణీల పేర్లు నమోదు చేయించాలి

UPDATED 27th AUGUST 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గల గర్భిణీల పేర్లను ఆరోగ్య కేంద్రంలో నమోదు చేయించే బాధ్యత అంగన్వాడీ, ఆశా కార్యకర్తలపై ఉందని సామర్లకోట అర్బన్ సిడిపివో టిడిఆర్ పద్మావతి అన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాతృ, శిశు మరణాల నివారణకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్థానిక గణపతినగరం అర్బన్ హెల్త్ సెంటర్లో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు సమన్వయ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపివో పద్మావతి మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, ఎఎన్ఎంలు సంయుక్తంగా గర్భిణీ స్త్రీల పేర్లను నమోదు చేయించాలని, నెలలు నిండకుండా ప్రసవాలు జరగకుండా మాతా శిశు మరణాలు తగ్గించేందుకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలని అన్నారు. అలాగే వారికి ఐరన్, కాల్షియం మాత్రలు, చిన్న పిల్లలకు విటమిన్ ఎ, ఐరన్, జింక్, ఆల్బెండోజల్ మాత్రలు ఆసుపత్రిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు. కిషోర బాలికలల్లో రక్తహీనత తగ్గించేందుకు, డయేరియా నివారించేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తీవ్ర పోషకాహార లోపం కలిగిన పిల్లలను గుర్తించి వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రజలు, లబ్ధిదారులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు సిబ్బందికి సమావేశాలు నిర్వహించామని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో యు.హెచ్.సి వైద్యురాలు శ్రీలత ఏఎన్ఏంలు దేవి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us