సూరంపాలెంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం

UPDATED 15th JUNE 2018 FRIDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సూరంపాలెం గ్రామంలో ఈనెల15 నుంచి 21వ తేదీ వరకు వారం రోజులు పాటు నిర్వహించు ప్రత్యేక శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కళాశాల ఛైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు హాజరై మాట్లాడారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గోవడం ద్వారా విద్యార్థులు అన్నిరంగాలలో పురోగతి సాధిస్తారని, తమ కళాశాల విద్యార్థులు, స్థానిక ప్రజల మధ్య సహృద్భావ వాతావరణం పెంపొందించడానికి,  సమాజంలో చోటు చేసుకుంటున్న నూతన మార్పులు, వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పడి భవిష్యత్తులో విద్యార్థులు భావి భారత ఉత్తమ పౌరులుగా రూపొందడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో సహకరిస్తాయని పేర్కొన్నారు. 2010వ సంవత్సరం నుంచి తమ కళాశాల విద్యార్థులు గ్రామస్తుల ప్రయోజనార్ధం ఉన్నత విద్య, మహిళా ఆరోగ్యం, అగ్ని ప్రమాదాల నివారణ, వృక్ష సంరక్షణ, నేత్ర వైద్య పరీక్షలు వంటి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి. సుధీర్, ఫాకల్టీ ఇన్ ఛార్జులు ఎ.ఎస్.కె.వి. ప్రేమజ్యోతి, ఫణీభాస్కర్, సుప్రీత, పవన్, సూరంపాలెం సర్పంచ్ రాజబాబు, చినబాబు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎమ్.వి గోపాలకృష్ణ, స్టూడెంట్ కో ఆర్డినేటర్లు ప్రమోద్ హర్ష, వి. సాయిరాం, లక్ష్మీ ప్రసన్న, ఎ.ఎస్.ఆర్. సంజీవరావు, కెవివివి రఘురామ్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us