UPDATED 22nd OCTOBER 2020 THURSDAY 10:00 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సృష్టించిన డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులను నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ G.O.RT.596 నెంబరుతో గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో పని చేస్తున్న సీనియర్ ఎండీవోలను రెవెన్యూ డివిజన్ల వారీగా డీడీవోలుగా నియమిస్తూ ఉత్తుర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఐ.పోలవరం ఎండీవో ఎస్. మధుసూదన్‌ను కాకినాడ డివిజన్‌కు, కొత్తపేట ఎండీవో కె. రత్నకుమారిని రాజమహేంద్రవరం డివిజన్‌కు, అంబాజీపేట ఎండీవో వి. శాంతమణిని అమలాపురం డివిజన్‌కు, డ్వామా ఏపీడీ కె.ఎన్.వి. ప్రసాద్‌ను పెద్దాపురం డివిజన్‌కు, కాజులూరు ఎండీవో కర్రి భీమేశ్వర్‌ను రామచంద్రపురం డివిజన్‌కు, పెద్దాపురం ఎండీవో అబ్బిరెడ్డి రమణారెడ్డిని రంపచోడవరం డివిజన్‌కు, పిఠాపురం ఎండీవో డి.ఎల్.ఎస్. శర్మను ఎటపాక డివిజన్‌కు డీడీవోలుగా నియమించారు.







