UPDATED 6th JANUARY 2020 MONDAY 5:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి తొమ్మిది అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటిలో భూ సర్వే చేయించమని ఒకటి, పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ లో మార్పు చేయించమని ఒకటి, కలుషిత నీటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఒకటి, ఏలేరు ముంపు నష్ట పరిహారం ఇప్పించమని ఒకటి, ఇళ్ళ పట్టాల సమస్యను పరిష్కరించమని ఒకటి, ఏలేరు పంట భూముల కరెంటు సమస్యపై ఒకటి, స్మశానవాటికకు ప్రభుత్వ భూమిని కేటాయించమని ఒకటి, భూఆక్రమణలు తొలగించమని ఒకటి, కళాశాల స్థల లోపాల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఒకటి అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు.







