రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

UPDATED 24th SEPTEMBER 2018 MONDAY 6:30 PM

పెద్దాపురం: అక్టోబర్ నెల 18 నుంచి 21వరకు జరుగనున్న రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక  కార్యక్రమం స్థానిక రామారావుపేటలోని శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ టేబుల్ టెన్నిస్ అకాడమీలో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తూర్పుగోదావరి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు రావు చిన్నారావు, శ్రీప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ సి.హెచ్. విజయప్రకాష్ హాజరై పోటీలను ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా తరపున రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలలో పాల్గొనడానికి నాలుగు టీములు ఎంపికయ్యాయి. జూనియర్ బాయ్స్ విభాగంలో టి. సూర్యతేజ,  యం.డి. ఫిరోజ్, యం.డి. అబ్దుల్, మంజు అవినాష్, జూనియర్ గర్స్ విభాగంలో చార్విఫాల్గుణ, యం. దీప్తి, డి. మహాలక్ష్మి, వైష్ణవి సూర్య, ఉమెన్ విభాగంలో టి.ఎల్. హర్షిత, చార్వి, యం. దీప్తి, వైష్ణవి సూర్య, పి. నిత్యల మెన్ విభాగంలో మోహిత్ శర్మ, ఎ. సాయిదీపక్, సి. హెచ్. నితేష్ వర్మ, మంజు అవినాష్, కుషాల్ కుమార్ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ కుమార్, సభ్యులు వేణుగోపాల్, అచ్యుతి, సింగరాజు, శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ సివోవో లెఫ్టినెంట్ కమాండర్ కె.ఎస్. రావు, టేబుల్ టెన్నిస్ కోచ్  నరేంద్రవర్మ, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us