చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్‌

UPDATED 6th SEPTEMBER 2017 WEDNESDAY 11:00 PM

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు చాలాకాలంగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడంపట్ల పవన్‌ హర్షం వ్యక్తంచేశారు. ఇటీవల కొందరు విద్యార్థులు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ను కలిసి తమ సమస్యను విన్పించుకున్నారు. దీనికి స్పందించిన పవన్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకంగా మారిన జీవోను రద్దుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి ముఖ్యమంత్రి స్పందించారు. జీవో 64ను రద్దుచేయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపశమనం కల్గిందని పవన్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇందుకుగాను సీఎం చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us