UPDATED 10th MAY 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక కంచి మహా సంస్థానం ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం హనుమజ్జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన లక్ష తమలపాకుల పూజలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. కంచి మహా సంస్థానం నిర్వాహకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.







